అనవసరపు ఆరోపణలు చేసి ఇప్పుడు నీళ్లు ఎలా విడుదల చేశారు
సిద్దిపేట అర్బన్,(విజయక్రాంతి): కాలేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) కుంగిపోయిందని కూలిపోవడం ఖాయమని అనవసరపు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధికారం చేపట్టిందని బీఆర్ఎస్ పార్టీ చిన్నకోడూరు మండల నాయకులు ఆరోపించారు. పొంగిపోయిన కాలేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎలా వచ్చాయని శనివారం మల్లన్న సాగర్(Mallanna Sagar), రంగనాయక సాగర్(Ranganayaka Sagar)ల నుంచి నీటిని ఎలా విడుదల చేశారని ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆరోపించారు. అబద్ధపు మాటలు చెప్పి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ప్రజల చేత చీ కొట్టించుకోవడం ఖాయమని ఎదవ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణ ప్రదాతలైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ఆరోపణలు చేసి ఇప్పుడు వారు నిర్మించిన ప్రాజెక్టులపై నడుచుకుంటూ వెళ్లిన కాంగ్రెస్ పార్టీ మంత్రికి మనసు ఒప్పడం లేదని ఆమె ఆత్మ విమర్శ చేసుకుంటే తెలుస్తుందని చెప్పారు. శనివారం జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) రంగనాయక సాగర్ నుండి రైతుల వ్యవసాయానికి నీళ్లు వదిలిన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు రంగనాయక సాగర్ కుడి కాల్వలో కేసిఆర్, హరీష్ రావుల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, కీసర పాపయ్య, గుండెల్లి వేణు, గుజ్జ రాజు, మన్నే ఆనంద్, గొళ్లపల్లి రాజశేఖర్ రెడ్డి, కంకటి మహేష్, కొత్త శంకర్, రామచంద్రం, ఎలుక అనిల్. చెట్టిపెల్లి భాను, జంగిటి ఆనందం, పడిగె లింగం, అయ్యా రాజయ్య, కోరమేన రవి తదితరులు పాల్గొన్నారు.