calender_icon.png 20 April, 2025 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌పై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు

20-04-2025 07:57:44 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ నర్సింగ్ రావు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. రోహిత్ ను ప్రశ్నించినందుకు నర్సింగ్ రావును పోలీసుల చేత దాడి చేయించాడని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి రోహిత్ పై చర్యలు తీసుకోవాలని, అలాగే రోహిత్ ఆదేశాలతో నర్సింగ్ రావుపై దాడి చేస్తూ, ఆ దృశ్యాలను చిత్రీకరించిన పోలీసులపై సైతం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని మెదక్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం సోషల్ మీడియా వారియర్ నర్సింగ్ రావును పరామర్శించి, వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, తదితర బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.