calender_icon.png 15 March, 2025 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

14-03-2025 07:42:47 PM

మేడ్చల్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు మేడ్చల్ జిల్లాలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సుంకరి రాజు, ఎమ్మెల్యేలు వివేకానంద్, మర్రి రాజశేఖర్ రెడ్డి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రవీంద్ర భారతిలో ఈ నెల 12న జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ ను ఉద్దేశించి స్టాచర్ నుంచి స్ట్రేచర్ కు వెళ్లారని, రేపు స్ట్రెచర్ నుంచి మార్చురీకి వెళ్తారని వ్యాఖ్యానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడమే గాక అవమానకరంగా మాట్లాడారని తెలిపారు. సమాజంలో గొడవలు సృష్టించే విధంగా, రెచ్చగొట్టేలా మాట్లాడారని, ముఖ్యమంత్రిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.