calender_icon.png 2 April, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు

31-03-2025 07:01:11 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దిన్ ఈద్గాపై రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం టిఆర్ఎస్ నాయకులతో పట్టణ నాయకులు ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనల అనంతరం రంజాన్ శుభాకాంక్షలు తెలిపి అలింగణం చేసుకున్నారు. ఎన్ ఎన్ జి ఓ ఎస్ కాలనీలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దిన్ స్వగృహంలో బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా నాయకులు పట్టణ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువ, పూలమొక్క ఇచ్చి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ గైని శ్రీనివాస్ గౌడ్, గెరిగంటి లక్ష్మినారాయణ, పిట్ల వేణుగోపాల్, మాసుల లక్ష్మినారాయణ, సంగి మోహన్ తదితరులు పాల్గొన్నారు.