calender_icon.png 16 March, 2025 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండ్లు పంచిన బీఆర్‌ఎస్ నాయకులు

14-03-2025 12:00:00 AM

జనగామ టౌన్, మార్చి 13: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. జనగామ ఎమ్మెల్యే  పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు జిల్లా ఆస్పత్రిలో పాలు, పండ్లు, బ్రెడ్  పంపిణీ చేశారు.

అనంతరం రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ము స్లింలకు జామియా మజీద్‌లో ఇఫ్తార్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాదంశెట్టి రమేశ్ చంద్ర, మాజీ కౌన్సిలర్ ధర్మపురి శ్రీనివాస్ , బీఆర్‌ఎస్ నాయకులు ఎండీ.మాజీద్ , ఎండీ.అన్వర్, ఎండీ.సలీం, యాకూబ్, జహంగీర్ , అనంతుల ఆంజనేయులు, రఘు ఠాగూర్ పాల్గొన్నారు.