హైదరాబాద్: బోడుప్పల్ బీఆర్ఎస్ యువజన నాయకులు సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై ఫిర్యాదు చేశారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను డబల్ ఇస్మార్ట్ సినిమా లోని ఒక సాంగ్ లో పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మేడిపల్లి పోలీస్ స్టేషన్లో పూరి జగన్నాథ్ పై ఫిర్యాదు చేశారు. కేసీఆర్ మాటలను తీసి వేయాలని, లేని పక్షంలో సినిమాని తెలంగాణ వ్యాప్తంగా అడ్డుకుంటామని పూరీ జగన్నాథ్ ను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ యువజన నాయకులు, ఉప్పరి విజయ్, మోతె రాజు, రాజ్ అక్కి, వినయ్, రాకేష్, మురళి తదితరులు పాల్గొన్నారు. రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ వివాదం రోజురోజుకు ముదురుతోంది.