calender_icon.png 22 December, 2024 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లమ్మ గుడిలో ప్రమాణం చేద్దాం రండి

16-09-2024 07:26:09 PM

మీరు నిరశ్రాయులను చేస్తే మేము ఓదార్చం

మీరే పట్టాల ఇచ్చి.. మీరే ఇల్లు కూల్చిండ్రు

మీ పేరు మంచిగుండలని అధికారులను బదలం చేస్తున్నావు

గడచిన తొమ్మిది నెలల పాలనలో మీరు తీసుకొచ్చిన కొత్త పని ఒక్కటి చెప్పండి

మాజీ మంత్రి శ్రీనివాస్ తమ్ముడిని ఇరికించడం సిగ్గుచేటు

విలేకరుల సమావేశంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మాజీ ముడా చైర్మన్ వెంకన్న, బీఆర్ఎస్ నేతలు

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): మేము తప్పు చేశాం మీరు తప్పు చేశాం కాదు ఎవరు తప్పు ఎవరు తప్పు చేశారు తెలియాలంటే జిల్లా కేంద్రంలోని నడిబొడ్డున ఉన్న ఎల్లమ్మ గుడి దేవాలయంలో ప్రమాణం చేసేందుకు రావాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డికి మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మాజీ ముడా చైర్మన్ గంజి వెంకన్న, బీఆర్ఎస్ నేతలు సవాల్ విసిరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ లో గల 523 సర్వేనెంబర్ నందు రెండు వేల పైచిలుకు పట్టాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. దివ్యాంగులు ఈ భూముల్లో ఇల్లు నిర్మించుకుంటే వారు అర్హులంటూ అర్ధరాత్రి ఎవరికి సమాచారం ఇవ్వకుండా పోలీసులని బందోబస్తుగా ఉంచుకొని ఇండ్లు కులకొట్టడం ఎంతవరకు సమంజసం ఉన్నారు.

అధికారులు కూల్చారు మాకు సమాచారం లేదని చెప్పడం సరికాదని నిరుపేదలను ఇబ్బందులు పెడితే పుట్టగతులు ఉండవని తెలిపారు. వారు రోడ్డున పడితే కనీసం భోజనం పెట్టి ఆదుకోవడం జరిగిందని మేము పరామర్శిస్తే మాపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తే ఎవరు భయపడబోరని తెలిపారు. ఎల్లమ్మ గుడిలో ప్రమాణం చేస్తే మేము తప్పు చేశాము మీరు తప్పు చేశారు. తెలుస్తుందని అంతా ఆ ఎల్లమ్మ చూసుకుంటుందని పేర్కొన్నారు. మేము పట్టాలు ఇచ్చేటట్లు ఉంటే అధికారంలో ఉన్నప్పుడు భాజప్త ఇచ్చేవారిమి అని, మేము పట్టాలు ఇవ్వలేదని మీరే ఇచ్చి మీరే కూలగొట్టడంతో దివ్యాంగులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడని శ్రీకాంత్ గౌడ్ ను అనవసరంగా ఈ కేసులో ఉన్నాడంటూ ప్రచారం చేయడం సరికాదని తెలిపారు.

గడిచిన తొమ్మిది నెలల కాలంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని మండిపడ్డారు. మీరు తీసుకువచ్చిన కొత్త పని ఆ జీవో ఏంటో కాస్త వివరిస్తే మాకు కూడా తెలుస్తుందని తెలియజేశారు. ఏమి చేయకుండా కేవలం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ నేను మంచోడిని అనే విధంగా ఉండడం ప్రజలు గమనిస్తున్నారని సరైన టైంలో గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వందలాది మంది రోగులు ప్రతిరోజు ఇబ్బందులు పడుతూ వైద్య చికిత్సలు పొందుతున్నారని వారి బాగోగులు కాస్త చూస్తే సరిపోతుందని కేవలం రాజకీయం కోసం మాత్రమే మీరు ప్రయత్నం చేయడమేంటని ప్రశ్నించారు. దివ్యాంగులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కే సి నర్సింలు, మాజీ వైస్ చైర్మన్ తాటి గణేష్ తదితరులు ఉన్నారు.