05-04-2025 07:06:05 PM
మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య..
బెల్లంపల్లి (విజయక్రాంతి): బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు నిర్బంధాలకు, అక్రమ కేసులకు భయపడరని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శనివారం స్పష్టం చేశారు. తాను నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. బెల్లంపల్లి పట్టణ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నూనేటి సత్యనారాయణపై సోషల్ మీడియాలో భూకబ్జాపై పోస్ట్ పెట్టారని ఆరోపణపై తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్ లో అక్రమ కేసు నమోదు చేయడం బాధాకరమని చెప్పారు. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అక్రమాలపై, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతారని, అక్రమ కేసులకు వెనుకడుగు వేయరని ఆయన స్పష్టం చేశారు.