calender_icon.png 27 October, 2024 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భ్రమల్లో బీఆర్‌ఎస్ నేతలు

01-08-2024 02:17:33 AM

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీఆర్‌ఎస్సే అధికారంలో ఉన్నట్టు ఆ పార్టీ నేతలు భ్రమల్లో ఉన్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఎద్దేవాచేశారు. అసెంబ్లీ సమావేశాల వాయిదా అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్ సభ్యులకు రెండు గంటల సమయం ఇచ్చామని చెప్పారు. ప్రజాపాలనను జీర్ణించుకోలేకే బీఆర్‌ఎస్ సభ్యులు సభను స్తంభింపచేయాలని ప్రయత్నించారని ధ్వజమెత్తారు.  

కాంగ్రెస్‌కు ‘సబితా’ వెన్నుపోటు: ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి

మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ‘చేవెళ్ల చెల్లెమ్మ’ అని పిలిచేవారని, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె ఎన్నో పదవులు అనుభవించి తర్వాత పార్టీకి వెన్నుపోటు పొడిచారని ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి ఆరో పించారు. సభను తప్పుదారి పట్టించేందుకు బీఆర్‌ఎస్ నేతలు యత్నిం చారని ధ్వజమెత్తారు.  

ప్రతిపక్షానికి తగిన సమయం ఇచ్చాం: ఎమ్మెల్యే పర్ణికారెడ్డి

అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్‌కు తగిన సమయం ఇచ్చామని నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి స్పష్టంచేశారు. బీఆర్‌ఎస్ సభ్యులు కావాలనే సభలో గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి ‘వెనుక ఉన్న అక్క లు’ అంటే కొందరు సభ్యులు ‘గుమ్మడికాయల దొంగ భుజాలు తడుము కున్నట్టు’ వ్యవహరించారని ఎద్దేవా చేశారు. సీఎం మహిళా సభ్యులను గౌరవించి, వారిలో కొత్త సభ్యులకు సైతం అవకాశం ఇస్తున్నారని స్పష్టం చేశారు. సభలో సభ్యులు హుందాగా ప్రవర్తించి తమ లాంటి కొత్త సభ్యులకు మార్గనిర్దేశంగా ఉంటే బాగుంటుందని హితవు పలికారు.