హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం బుల్ డోజ్ సమావేశాలుగా మార్చిందని బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ను తిట్టేందుకు సమావేశాలను వినియోగించుకున్నారని ఆరోపించారు. ఆరు రోజుల్లో ప్రశ్నోత్తరాల కోసం ఒక రోజు మాత్రమే అవకాశం ఇచ్చారని విమర్శించారు. జీరో అవర్ ప్రస్తావనే లేకుండా పోయిందన్నారు. కేవలం రెండు రోజుల్లోనే పద్దులపై చర్చ పూర్తి చేశారని తెలిపారు. సమస్యలను ప్రస్తావిస్తే మైక్ కట్ చేశారని మండిపడ్డారు. నిరసన తెలిపితే మార్షల్స్ తో సభ నుంచి బయటకు పంపించారని వెల్లడించారు. రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు.. ప్రతిపక్షాలపై పంజాపాలన అని ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.