calender_icon.png 19 January, 2025 | 11:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఉద్యమకారుడు 'జిట్టా బాలకృష్ణారెడ్డి' ఇకలేరు

06-09-2024 10:54:01 AM

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో జిట్టా బాలకృష్ణారెడ్డి భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు భువనగిరికి తరలించారు. సాయంత్రం 4 గంటలకు పట్టణ శివార్లలోని మగ్గంపల్లి రోడ్డులో ఉన్న తమ ఫామ్‌హౌస్‌లో అంతక్రియలు నిర్వహిస్తామని కుటుంబీకులు వెల్లడించారు. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు భువనగిరి ముద్దుబిడ్డ జిట్ట బాలకృష్ణ రెడ్డికి గుర్తింపు ఉంది.