calender_icon.png 26 December, 2024 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్

26-12-2024 10:21:46 AM

హైదరాబాద్: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాసబ్ ట్యాంక్ పోలీసులు బంజారాహిల్స్ లో నమోదైన కేసులో నోటీసులు ఇవ్వడానికి మారేడ్ పల్లిలోని ఎర్రోళ్ల శ్రీనివాస్ వెళ్లారు. పోలీసు విధుల అడ్డగింత వ్యవహారంలో గతంలో శ్రీనివాస్ పై కేసు నమోదైంది. ఇదే విషయంలో గతంలో కౌశిక్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా 20 మందిపై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు అధికారిగా మాసబ్ ట్యాంక్ ఇన్ స్పెక్టర్ ఉన్నారు. విచారణకు రావాలని ఎర్రోళ్ల శ్రీనివాస్ కు నోటీసులు ఇవ్వడానికి పోలీసులు అతని ఇంటికి వెళ్లినప్పుడు తలుపులు తెరవలేదు. విషయం తెలుసుకుని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన నివాసానికి చేరకుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు ఎర్రోళ్ల శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు.