calender_icon.png 25 April, 2025 | 12:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘల్లు ఘల్లున ఓరుగల్లుకి తరలిరండి

24-04-2025 12:09:09 AM

బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు

మణుగూరు ఏప్రిల్ 23 (విజయక్రాంతి):టిఆర్‌ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజితోత్సవ సంబరాలకు పినపాక నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకావాలని బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు బుధవారం మ ణుగూరు పట్టణంలో ప్రదర్శన నిర్వహించి బహిరంగ సభను జయప్రదం చేయాలని వి స్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కన్వీనర్ కురి నాగేశ్వరరావు, కుంట లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ రా ష్ట్ర ప్రజల హృదయంలో చెరగని ముద్ర వేసిన టిఆర్‌ఎస్ వరంగల్ బహిరంగ సభ భవిష్యత్ తెలంగాణ రాజకీయ సమీకరణలో మార్పులకు ప్రధాన అంశం కానుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు వ ట్టం రాంబాబు ముద్రoగుల కృష్ణ తాళ్లపల్లి యాదగిరి గౌడ్, నూకారపు రమేష్, ఆవుల నరసింహారావు, రామకోటి తదితరులు పాల్గొన్నారు.