06-03-2025 10:37:50 AM
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) అధ్యక్షతన శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కీలక సమావేశం జరగనుంది. సమావేశానికి హాజరుకావాలని ఇప్పటికే పార్టీ నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) సమాచారం ఇచ్చారు. సంస్థాగత అంశాలపై చర్చించేందుకు బీఆర్ఎస్ కీలక సమావేశం నిర్వహించనుంది. పార్టీ రజతోత్సవ కార్యక్రమాలతో పాటు సంస్థగత అంశాలపై బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) చర్చించనుంది. పార్టీ సభ్యత్వ నమోదు విషయంపై కూడా నేతలతో గులాబీ బాస్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో బలాబలాల దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీకి ఒకటిదక్కే అవకాశముండే. ఎమ్మెల్సీ అవకాశంపై పలువురు నేతలు ఆశలు పెట్టున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. శాసనసభ కోటా ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై కూడా కేసీఆర్ చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.