calender_icon.png 1 November, 2024 | 9:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంజీఎం ఎదుట బీఆర్‌ఎస్ ఆందోళన

11-08-2024 12:05:00 AM

హనుమకొండ, ఆగస్టు 10 (విజయక్రాంతి): వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఎదుట శనివారం బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ.. ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి మూడు రోజుల పసిపాపను కాపాడలేకపోయిన ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఆసుపత్రిలో సదుపాయాలపై శ్రద్ధ పెట్టకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఈ ఘటన ఎంజీఎంలోనే జరిగినా జరగలేదని చెబుతున్న సూపరింటెండెంట్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో సీసీ కెమెరాలు ఎల్లప్పుడూ పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వనా షమీమ్, కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, మరుపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు. 

పసికందు ఘటనతో ఎంజీఎంకు సంబంధం లేదు

ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో శుక్రవారం రాత్రి శిశువును కుక్కలు పీక్కుతి న్న ఘటనపై సూపరింటెండెంట్ సీహె చ్ మురళి స్పందించారు. ఈ ఘటనకు ఎంజీఎం ఆసుపత్రికి ఎలాంటి సంబం ధం లేదన్నారు. మీడియాలో వస్తున్న వార్లల్లో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. ఎంజీఎంలో సహజ కాన్పులు జరగవని, ఈ వారం రోజుల్లో ఏ విధమైన కాంప్లికేటెడ్ సిజేరియన్ డెలివ రీలు జరగలేదన్నారు. నవజాత శిశువులు కనిపించకుండా పోయినట్లు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. బయట ప్రదే శం నుంచి కుక్కలు శిశువు ను నోట కరుచుకుని వచ్చి ఉండవచ్చని తెలిపారు.