19-04-2025 12:00:00 AM
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): నిరుద్యోగులకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తుంటే.. బీఆర్‌ఎస్ నేతలకు కడుపుమంట ఎందుకుని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి పాత, కొత్త నోటిఫికేషన్లు కలిపి 57 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పారు.
ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బీఆర్‌ఎస్ నిరుద్యోగులను మోసం చేసింద న్నారు. గ్రూప్-1పై బీఆర్‌ఎస్ నేతలు కావాలనే కేసులు వేస్తున్నారనిమండిపడ్డారు. ఆ పార్టీ హయాంలో టీజీపీఎస్సీ, ఇంటర్ పేపర్లు లీకై విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినప్పుడు.. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ బిజినెస్‌లో బిజీగా ఉన్నారన్నారు.