calender_icon.png 24 November, 2024 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో బీఆర్‌ఎస్‌దే భవిష్యత్

24-11-2024 12:54:07 AM

బీఆర్‌ఎస్ నేత దేవిప్రసాద్

హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణలో భవిష్యత్ బీఆర్‌ఎస్‌దేనని ఆ పార్టీ సీనియర్ నేత దేవిప్రసాద్ పేర్కొన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఫలితాలతో రెండు జాతీయ పార్టీలపై పెరుగుతున్న వ్యతిరేకత స్పష్టమైందని ఆయన శనివారం ప్రకటనలో తెలిపారు. ప్రాంతీయ పార్టీల సహకారం లేకుండా ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేమనే సత్యాన్ని అక్కడి ప్రజలు చాటిచెప్పారన్నారు.

హామీల అమలు ప్రభావం ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందన్నారు. బీజేపీకి వ్యతిరేక వాతావరణం ఉన్నా.. ఉపయోగించుకోవడంలో కాంగ్రెస్ చతికిల పడిందన్నారు. కాంగ్రెస్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని, జార్ఖండ్‌లో జేఎంఎ గెలుపు చారిత్రక విజయమని కొనియాడారు. హేమంత్ సోరెన్‌ను అక్రమంగా అరెస్టు చేయడంతో అదివాసీల్లో బీజేపీపై వ్యతిరేకత వచ్చిందని పేర్కొన్నారు.