మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్
మహబూబాబాద్, నవంబర్ 18 (విజయ క్రాంతి) : లగచర్ల ఘటనపై బీఆర్‌ఎస్ పూర్తి బాధ్యత వహించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ మురళీనాయక్ డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో నిర్వహించిన గిరిజన ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి బీఆర్‌ఎస్ నాయకులు తమపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్‌ఎస్ హయాంలో వందల ఎకరాల భూములు కబ్జాకు గురైనట్లు తమ వద్ద ఆధారాలున్నాయన్నారు. పదేళ్లలో రూ.కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించిన ఘనత బీఆర్‌ఎస్‌దే నన్నారు. సమావేశంలో ఎంపీ బలరాంనా యక్, ఎమ్మెల్యే రామచంద్రనాయక్, ఎమ్మెల్యే బాలునాయక్, మందుల సామేల్, మాజీ మంత్రి రవీందర్‌నాయక్ పాల్గొన్నారు.