ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాం తి): రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిపై సోషల్ మీడియాలో కారుకూతలు కూయడం బీఆర్‌ఎస్ నేతలు మానుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివా స్ హెచ్చరించారు. విదేశీ పర్యటనలో భాగం గా అమెరికాకు సీఎం రేవంత్‌రెడ్డి సరికొత్త తెలంగాణను పరిచయం చేశారని, పెట్టుబడులకు తెలంగాణను స్వర్గధామంగా మార్చుతున్నారని తెలిపారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. సీఎం యూఎస్ టూర్ విజయవంతం కావడంతో బీఆర్‌ఎస్ నేతలు తట్టుకోవడం లేదని మండిపడ్డారు.
గతంలో సూటు బూటు వేసుకుని దావోస్ వెళ్లిన కేటీఆర్ ఎన్ని కంపెనీలను తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఎంవో యూ కుదుర్చుకున్న కంపెనీలన్ని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని తెలిపారు. రేవంత్‌రెడ్డి సక్సెస్‌ను తక్కువ చేసి చూపించేందుకు బీఆర్‌ఎస్ సోషల్ మీడియా చాలా కష్టపడు తోందన్నారు. అంగుళం భూమి కేటాయించకముందే మనీలాండరింగ్ జరిగిందని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తప్పులు చేసి తీహార్ జైల్లో ఎవరున్నారో ప్రజలకు తెలుసంటూ మండిపడ్డారు.