calender_icon.png 29 April, 2025 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ మూడు ముక్కలాట..!

28-04-2025 12:58:22 AM

  1.  రజతోత్సవ వేడుకలకు బోసిపోయిన పార్టీ దిమ్మెలు జెండాలు 
  2.  వాల్ రైటింగ్ లకే పరిమితం 
  3.  వర్గపోరుతో క్యాడర్ సతమతం 
  4.  నియోజకవర్గాన్ని పట్టించుకొని ఇంచార్జి

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 27 (విజయ క్రాంతి): ఆ పార్టీ పుట్టి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి గ్రామంలో నిర్వహించిన రజితోత్సవ వేడుకలకు భారీగా జన సమీకరణ చేసింది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గ ఇన్చార్జీలు ప్రత్యేక చొరవ చూపి గ్రామాల వారిగా పార్టీ కార్యకర్తలను సభకు తరలి వచ్చేలా తగిన ఏర్పాట్లు చేయాలని పార్టీ అధిష్టానం సూ చించింది.

కానీ నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో మూడుముక్కలాట లాగా వర్గ పోరు నడుస్తోంది. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి తన తనయుడు నాదం శశిధర్ రెడ్డి వర్గం ఒకటైతే అదే పార్టీలో బిసి నినాదంతో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైకానీ శ్రీనివాస్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ నియోజకవర్గానికి ఇన్చార్జిగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాత్రం నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో బిఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు.

ఈ మూడు వర్గాల వారిగా ఎవరి మాట వినాలో తెలియక సతమతమవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఓటమి అనంతరం పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగిన నేపథ్యం లో అప్పటి నుంచే నియోజకవర్గ సమస్యలు, ప్రజా సమస్యలపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదని టాక్ వినిపిస్తోంది. కేవలం వ్యక్తిగత ఇమేజ్ మాత్రమే పెంచుకునే విధంగా పెళ్లిళ్లు పేరంటాలు, ఓదార్పు కార్యక్రమాల్లో పా ల్గొంటూ తన కార్యవర్గాన్ని మాత్రమే పట్టించుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది.

ఈ నేపథ్యంలో ఆదివారం వరంగల్ సభకు తరలి రావలసిన కార్యకర్తలు వర్గ పోరు కారణంగా ఎవరి మాట వినాలో తెలియక సత మతమవుతూ ఆశించిన స్థాయిలో ముందు కు కదల లేదని తెలుస్తోంది. గత కొద్ది రోజుల క్రితం వరంగల్ సభ సన్నాక సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఫలితం మాత్రం ఆ స్థాయిలో క్షేత్రస్థాయిలో పనులు మాత్రం జరగలేదని తెలుస్తోంది.

కేవలం ఆయా మండల ప్రధాన కూడళ్ల వద్ద వరంగల్ సభ పేరుతో వాల్ పెయింటింగ్ వేయించి మమ అనిపించారు. గ్రామాల్లోని బిఆర్‌ఎస్ పార్టీ దిమ్మెలకు నూతన రంగులద్ది ఆ పార్టీ జెండా ఎగరవేసి పండుగ వాతావరణంలో వరంగల్ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. కానీ ఏ గ్రామం లో చూసినా ఆ పార్టీ జెండాదిమ్మెలు బోసిపోయి శిథిలావస్థకు చేరి గోన సంచులతో ముఖం చాటేస్థూ కనిపిస్తున్నాయి. పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసిన బస్సుల్లోనూ ఎక్కేందుకు తమ దినచర్యకు అనుకూలంగా డబ్బు ఇతర బాగోగులు చూసుకుంటేనే వస్తామంటూ షరతులు విధించినట్లు ప్రచారం జరుగుతుంది.