calender_icon.png 19 April, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ అధికారం బీఆర్‌ఎస్‌దే

08-04-2025 12:00:00 AM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 7 (విజ యక్రాంతి): రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి బిఆర్‌ఎస్ పార్టీ వస్తుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. సోమవారం పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సభ పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో అదిలాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ తో కలిసి నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల కు సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 27న పార్టీ రజతోత్సవ వేడుకలను నిర్వహించడం జరుగుతుందని సభ విజయవం తం చేసేందుకు ప్రతి ఒక్కరు కంకణ బదులు కావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మార్చుకోల సరస్వతి, అబ్దుల్ కలాం, రవీందర్, జగదీష్, సందీప్, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.