కాంగ్రెస్ ప్రభుత్వంపై బరుదజల్లే ప్రయత్నం
ప్రతిపక్ష నేతగానూ జనం వద్దకు వెళ్లని కేసీఆర్
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయి ఏడు నెలలు అవుతున్నా ఆ పార్టీ పెద్దలు ఇంకా భ్రమల నుంచి బయటకు రాలేకపోతున్నారని మం త్రి శ్రీధర్‌బాబు ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల భంగపాటు తర్వాత వారి లోపం ఎక్కడుందో తెలుసుకోకుండా, తమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నార న్నారు. ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం లోటుపాట్లను ఎత్తిచూపితే స్వాగతిస్తామన్నా రు. రాజకీయ పార్టీల గెలుపోటములను ప్రజలే నిర్ణయిస్తారన్నారని ఉద్ఘాటించారు.
ప్రజల అభిమానం ఉన్నంతకాలం ఏ రాజకీయ పక్షమైనా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇంత జరిగినా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీరులో ఎలాంటి మార్పు రాకపోడవంపై ప్రజలు పెదవి విరుస్తున్నారని మంత్రి అన్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లు సచివాలయానికి రాకుండా పాలన సాగించారని, ఫలితంగా ఎన్నికల్లో తిరస్కరణకు గురయ్యారని మండిపడ్డారు. కనీసం ప్రతిపక్ష నేతగా నైనా కేసీఆర్ జనంలోకి వెళ్తారని అనుకున్నామని, కానీ కార్యకర్తలనే తన వద్దకు పిలిపిం చుకుంటున్నారని విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ యాదృచ్ఛికంగా గెలిచిందని చెప్పడం బీఆర్‌ఎస్ ఆలోచనలను స్పష్టం చేస్తుందని ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్‌ఎస్ గెలవలేకపోయిందని, ఇది ప్రజలిచ్చిన తీర్పు కాదా? అని ప్రశ్నించారు. ఓటమితో దిష్టి తొలగిందని సమర్థించుకోవడం విడ్డూరంగా ఉందని, మళ్లీ అధికారంలోకి వచ్చి 15 ఏళ్లు ఉంటామని గాంభీర్యాలకు పోవడం అనేది కలల్లో జీవించడమే అన్నా రు. అధికారంలో ఉన్న పార్టీ ప్రజలకు మం చి చేసి గెలుస్తామని అనడంలో ఒక హేతుబద్ధత ఉందన్నా రు. కానీ నేలమట్టమైన పార్టీ మళ్లీ గెలిచి 15ఏళ్లు అధికారంలో ఉంటామని అందమైన ఊహ అనుకోవాలని ఎద్దేవాచేశారు.