calender_icon.png 31 January, 2025 | 7:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళితులను నిండా ముంచిన బీఆర్ఎస్

31-01-2025 04:39:19 PM

జిల్లా ఆర్టిఏ మెంబర్ అంకతి శ్రీనివాస్...

లక్షెట్టిపేట (విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టి దళితులను నిండా ముంచిందని జిల్లా ఆర్టిఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీలోని గురునానక్ గార్డెన్స్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మున్సిపాలిటీ, మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తూ ఆపసోపాలు పడ్తున్నారు. అందులో భాగంగానే అసంబద్ద కార్యక్రమాలు నిర్వహిస్తూ సిగ్గుమాలిన చర్యలకు పూనుకుంటున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలనలో ఉండీ ఏ ఒక్కరికి పేద ప్రజలకు రేషన్ కార్డు ఇవ్వలేదు. డబుల్ బెడ్ రూం ఇవ్వలేదు, దళితులకు మూడెకరాలు భూమి ఇవ్వలేదు. దళితున్ని సీఎం చేయలేదన్నారు. ఇలా చేప్తూపోతే బీఆర్ఎస్ పార్టీ హామీల పార్టీ తప్ప హామీలు అమలు చేసే పార్టీ కాదని గ్రహించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చారన్నారు.

కాబట్టి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకే వినియోగిస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిలతో పాటు గత ప్రభుత్వం చేయలేని ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అని అన్నారు. ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గాన్ని చూసుకున్నట్లైతే నియోజకవర్గంలో ప్రజా నాయకుడు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రజలకు కళగా ఉన్న మాతాశిశు ఆసుపత్రి, జనరల్ ఆసుపత్రి, లక్షెట్టిపేట గవర్నమెంట్ స్కూల్, దండేపల్లిలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాల నుండి చేయలేని కార్యక్రమాలు ఒకే సంవత్సరంలోనే చేశామన్నారు. ఇంకా కూడా చేస్తాం, ప్రజలెవరూ కూడా బీఆర్ఎస్ నాయకుల 420 మాటలు నమ్మరన్నారు. వారికి తగిన బుద్ది చెబుతూనే ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మండల అధ్యక్షులు పింగళి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమేలా రాజు, తోట రవి, సూరం చంద్రమౌళి, మడిపెల్లి స్వామి, అమీర్, హాజీ, సయ్యద్ షాహిద్ అలీ, రాజు, గోపతి రమేష్ ఉత్తూరి రవీందెర్, ప్రశాంత్, వార్డ్ అధ్యక్షులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.