కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి
హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ నేతలు చూస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీ య ఉపాధ్యక్షులు కోదండరెడ్డి విమర్శించారు. రైతుల ఆత్మహత్యలను ప్రోత్సహించే విధంగా బీఆర్‌ఎస్ నేత ల తీరు ఉందని మండిపడ్డారు. బుధవారం గాంధీభవన్‌లో మాట్లాడు తూ.. ఖమ్మం జిల్లాలోని ఒక రైతు తన వ్యవసాయ భూమిని ఆక్రమించారని వీడియో తీస్తూ ఆత్మహత్య చేసుకున్నాడని, అందులో కాంగ్రెస్‌ను దృష్టిలో పెట్టుకుని మాట్లాడా టాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయం లో అనేక మంది ఆత్మహత్య చేసుకునేలా బీఆర్‌ఎస్ వ్యవరించిందని, ధరణితో లక్షల కుటంబాలు రోడ్డున పడ్డాయని ఆరోపించారు. రైతు ప్రభాకర్ ఆత్మహత్య మీద పూర్తి విచారణ చేయాలని కిసాన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపా రు. బీఆర్‌ఎస్ నేతలు రెచ్చగొట్టి.. రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తున్నారన్నారు.