మాజీ ఎంపీ రవీంద్రనాయక్
జనగామ, నవంబర్ 3 (విజయక్రాంతి): పదేళ్ల పాటు బీఆర్‌ఎస్ అనేక అవినీతి, కుంభకోణాలకు పాల్పడితే బీజేపీ పరోక్షంగా ప్రోత్సహించిందని మాజీ ఎంపీ రవీంద్రనాయక్ ఆరోపించారు. ఆదివారం జనగామ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చుకుందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్‌ను జైలుకు పంపుతామని ప్రగడ్బాలు పలికిన బీజేపీ కేంద్రంలో అధికారం ఉన్నప్పటికీ ఏం చేయలేదన్నారు. బీజేపీ బలోపేతం చేస్తున్న బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించి బీఆర్‌ఎస్ బలవంతం అయ్యేలా పరోక్షంగా సాయం చేసిందన్నారు. మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో అవినీతికి పాల్పడ్డ కేసీఆర్‌ను ప్రశ్నించినందుకు బండి సంజయ్‌ను పక్కన పెట్టారన్నారు. ఇప్పుడు బీజేపీ నాయకులు కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.