calender_icon.png 20 September, 2024 | 7:09 PM

మహిళలకు వడ్డీ లేని రుణాలను బీఆర్ఎస్ పట్టించుకోలేదు

27-07-2024 08:13:22 PM

హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో శనివారం బడ్జెట్ పై సాధారణ చర్చ జరుగుతుంది. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ పై సమాదానం ఇస్తున్నారు. బీసీ సబ్ ప్లాన్ కు రూ.10,028 కోట్లు, మైనార్టీల సబ్ ప్టాన్ కు రూ.3002 కోట్లు, ఎస్సీ సబ్ ప్లాన్ కు రూ.33,124 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ కు రూ.17,056 కోట్లు కేటాయించామని ఆయన తెలిపారు.  ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను గత ప్రభుత్వం సరిగా ఖర్చు చేయలేదని, ఖర్చు చేసి ఉంటే చాలా కుటుంబాల పేదరికం నుంచి బయటపడి ఉండేవని భట్టి తెలిపారు. మహిళలకు వడ్డీ లేని రుణాలను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, మేం మాత్రం మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.20 వేల కోట్లు కేటాయించామన్నారు.

రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటే బీఆర్ఎస్ నేతలు నవ్వారని వ్యాఖ్యనించారు. మేం మాత్రం చెప్పింది.. చేప్పినట్లుగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం చదువులు ఉద్యోగ అవకాశాలకు సరిపడే విధంగా లేవని, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలు పెంచేందుకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో అత్యాధునిక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నామని ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.