calender_icon.png 30 April, 2025 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగుబోతుల రాష్ట్రంగా మార్చింది బీఆర్‌ఎస్

28-04-2025 12:31:17 AM

 ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి

కామారెడ్డి, ఏప్రిల్ 27,(విజయ క్రాంతి):మిగులు బడ్జెట్ కాగల తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత టిఆర్‌ఎస్ నాయకులు చంద్రశేఖర రావు కు దక్కుతుందని రాష్ర్ట ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, తెలంగాణ ఉద్యమ రాష్ర్ట అధ్యక్షుడు పిడమర్తి రవి అన్నారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల రోడ్డు భవనాల శాఖ అతిథిగృహంలో ఆదివారం సాయంత్రం పత్రిక విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నో రకాల ఆదాయం మార్గాలు గల పచ్చడి తెలంగాణను అప్పుల కుప్పగా మార్చి ప్రజలను తాగుబోతులుగా చేసిన కేసీఆర్ ప్రజలు ఆయన పద్ధతి నచ్చక అసెంబ్లీ ఎన్నికలలో ఫామ్ హౌస్కే పరిమితం చేసి బుద్ధి చెప్పినా అహంకారం ఇంకా తగ్గలేదని ఆయన అన్నారు.

అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన కెసిఆర్ ఏనాడు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని కెసిఆర్ ఎలా ప్రజల మనిషి అవుతాడని ఇటువంటి నాయకులకు తగిన గుణపాఠం ప్రజలే చెప్తారని ఆయన అన్నారు. అసెంబ్లీలో అడుగుపెట్టని కేసీఆర్ ఫామోజులో మద్యం మత్తులో తిరుగుతున్న ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆయన అన్నా రు. ఎంపీ ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలవని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థులనే నిలబెట్టకపోవడం పార్టీకి పరిస్థితి ఏమిటో ప్రజలకు అర్థమైపోయింది అని ఆయన అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎట్లా ఓడిపోతామని అభ్యర్థులను నిలపలేదని ఆయన అన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ వజ్రోత్సవ సభల పేరిట వేల కోట్లు అక్రమ డబ్బులు ఖర్చు చేస్తుందని ఉండడానికి ఇల్లు లేని వాడు టిఆర్‌ఎస్ హయాంలో ఫామోజులు నిర్మించుకొని రోజు మధ్యాహ్నం తాగుతూ సమయాన్ని అంతా వృధాగా గడిపిన వారు రాజకీయాల్లో గెలవా లేకపో యారని తెలంగాణ ప్రజలను వంచించిన కేసీఆర్ మళ్లీ ఫామ్ హౌస్‌కు పరిమితం కావడానికి సిద్ధం గా ఉండబోతున్నారని ఆయన హెచ్చరించారు.

కాలేశ్వరం ప్రాజెక్టు పేరిట లక్ష కోట్ల దుర్వినియోగం చేసి కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆయన అన్నారు. 10 సంవత్సరాలలో ఒక రేషన్ కార్డు ఇవ్వని టిఆర్‌ఎస్ ప్రజలను తాగుబోతులను చేసి గ్రామానికి బెల్టు షాపులు ఏర్పాటు చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా టిఆర్‌ఎస్ నాయకులు కేసీఆర్ నాయకత్వాన్ని అర్థం చేసుకొని మెలగాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.