calender_icon.png 22 February, 2025 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణా ప్రాజెక్టులపై మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు

22-02-2025 01:09:17 AM

  1. దక్షిణ తెలంగాణకు కరువు తెచ్చిందే కేసీఆర్ ప్రభుత్వం
  2. మేం మూడేళ్లలో ప్రాజెక్ట్‌లన్నింటినీ పూర్తి చేస్తాం
  3. నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్ నేతలకు లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో మంజూరైన ప్రాజెక్టులను బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.

కృష్ణా బేసిన్ పరిధిలోని పాలమూరు -రంగారెడ్డి  పథకం ద్వారా 67.52 టీఎంసీలు, డిండి -25.64 టీఎంసీలు, ఎస్‌ఎల్‌బీసీ 9.84టీఎంసీలు.. మొత్తం 100 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసుకునే అవ కాశం ఉన్నప్పటికీ, బీఆర్‌ఎస్ ప్రభు త్వం ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు.

జలాలను పారించకుండా దక్షిణ తెలంగాణకు కరువు తెచ్చిందే నాటి సీఎం కేసీఆర్, నాటి ఇరిగేషన్ మంత్రి హరీ శ్‌రావు అని ధ్వజమెత్తారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న మూడేళ్లలో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మంత్రి ఉత్తమ్ చొరవతోనే సమావేశానికి అడుగులు..

తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న కృష్ణా జలాల పంపకాల సమస్యపై రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చొరవతోనే కేఆర్‌ఎంబీ రెండు ప్రభుత్వాలతో శుక్రవారం సమావేశానికి పూనుకున్నదని, కానీ.. ఏపీ ప్రభుత్వం గైర్హాజరు కావడంతో సమావేశం వా యిదా పడిందని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు.

సమావేశం వాయిదా పడిన ప్పటికీ ఇరిగేషన్ అధికారులు తమ డిమాండ్లను బోర్డుకు వివరించారని స్పష్టం చేశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల రాజస్థాన్‌లో కేంద్ర జల వవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయిన నదీ జలాల సమస్యను వివరించారని, మంత్రి అభ్యర్థన మేరకే కేంద్రం జోక్యం చేసుకుంటున్నదని వెల్లడిస్తున్నారు.