calender_icon.png 1 October, 2024 | 7:20 AM

బీఆర్‌ఎస్‌కు మహిళలంటే గౌరవం లేదు

01-10-2024 02:22:47 AM

  1. అధికారిక కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ స్వాగతం పలికితే తప్పుడు ప్రచారామా..? 
  2. కంటతడి పెట్టిన మంత్రి కొండా సురేఖ 

హైదరాబాద్, సెప్టెంబర్ 30(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీకి మహిళ లు అంటే గౌరవం లేదని, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. రెండోసారి అధికారంలో వచ్చాక.. బీఆర్‌ఎస్ నాయకులు డబ్బు, మదమొక్కి పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు.

మెదక్ జిల్లా దుబ్బాకలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పం పిణీ కార్యక్రమానికి తాను ఇన్‌చార్జ్ మంత్రిగా వెళ్లగా స్థానిక ఎంపీ రఘునందన్‌రావు స్వాగతం పలుకుతూ.. మూడు రంగులతో కూడిన నూలుపో గు దండా వేస్తే బీఆర్‌ఎస్ నేతలు సోషల్ మీడియాలో ఒక మహిళా మం త్రిని అవమానిస్తూ తప్పుడు  ప్రచారాలు చేయడం సమంజసమా? అం టూ మంత్రి సురేఖ కంటతడి పెట్టుకున్నారు.

సోమవారం ఆమె గాంధీభవన్‌లో పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. మహిళలపై పెడుతున్న అవమానకరమైన పోస్టులపై కేసీఆర్ భార్య శోభమ్మ స్పందించాలన్నారు. ‘అధికారం కోల్పోయిన బాధలో బీఆర్‌ఎస్ నేతలు ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు.

ఆ పార్టీ మహిళా నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత పై ఇలాంటి ట్రోలింగ్, వ్యాఖ్యలు చేసే ఊరుకుంటారా? రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తే.. బస్సుల్లో డిస్కో డ్యాన్సులు చేస్తున్నారని కేటీఆర్ అవమానించారు. ప్రభుత్వ విధానాలపర ంగా ఎన్ని విమర్శలు చేసినా తట్టుకుంటాం.. కానీ, ఒక మహిళలను నేరుగా టార్గెట్ చేసి వ్యక్తిగతంగా అవమా నించడం సరికాదు.

దండ వేసినంత మా త్రాన ఇంత చిల్లరగా వ్యవహారిస్తారా? గతంలో మంత్రి సీతక్కపైన ఇలాగే వ్యవహారించారు’ అని మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలుంటాయని, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కూడా సీరియస్‌గా ఉన్నారన్నారు. 

మహిళలను గౌరవించడం అందరి బాధ్యత: హరీశ్‌రావు 

మహిళలను గౌరవించడం మనందరి బాధ్యత అని, వారి పట్ల అగౌరవం గా ప్రవర్తించడం ఎవరూ సహించరని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్ అయిన, వ్యక్తిగతంగా తాను ఉపేక్షించబోనని, మంత్రి కొండా సురేఖకు కలిగిన అసౌకర్యానికి తాను చింతిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా జరిగే ఇలాంటి వికృత చేష్టల ను తీవ్రంగా ఖండిస్తున్నానని వెల్లడించారు.