calender_icon.png 19 March, 2025 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌కు దళితులంటే గౌరవం లేదు

19-03-2025 02:17:57 AM

కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేటీఆర్, జగదీశ్ రెడ్డి ల ఫ్లెక్సీ దహనం

ఆదిలాబాద్, మార్చ్ 18 (విజయ క్రాంతి) : దళితులకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పెద్దపీట వేసి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ ని స్వీకర్ ను చేస్తే బీఆర్‌ఎస్ దురంహకారంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు.

అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ్లెక్సీని దహనం చేసిన కాంగ్రెస్ శ్రేణులు నిరసన నినాదాలతో హోరెత్తించాయి.  ఈ సందర్భంగా కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ...బీఆర్‌ఎస్ పార్టీ నేతలకు దళితులంటే గౌరవం లేదని అన్నారు. స్వీకర్ అనే కనీస గౌరవం లేకుండా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఈ చర్య ను ముక్తకంఠంతో ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు..