మంత్రి జూపల్లి కృష్ణారావు
కామారెడ్డి, జనవరి 7 (విజయక్రాంతి): గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే భూస్థాపితం అయిందని, రాబోయే రోజుల్లో మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుందని టూరిజం, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమా ఆయన మాట్లాడారు.
పదవి అలంకారప్రాయం కావొద్దు
పదవులు అలంకారప్రాయం కావొద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారోత్సవం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. నూతన పాలకవర్గ సభ్యులు, మార్కె కమిటీకి ఆదాయం వచ్చేలా రైతుల శ్రేయస్సు కోసం కష్టపడాలన్నారు. కాంగ్రెస్ పేద ప్రజల ప్రభుత్వమన్నారు.
ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని బీఆర్‌ఎస్ నేతలు పాతర వేశారని, ప్రగతి భవన్ వెళ్తే గేట్లు బంద్ చేసేవారన్నారు. కామారెడ్డి పెద్ద చెరువును టూరిజంగా మార్చేలా అభివృద్ధి చేస్తా నని, విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించ డం కోసం రూ.50 లక్షలు మంజూరు చేస్తానని తెలిపారు.
మంత్రి వెంట జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి, రాజా గౌడ్, వైస్‌చైర్మన్ బ్రహ్మానందంరెడ్డి, ఆగ్రో కా ర్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ ఉన్నారు.