calender_icon.png 7 January, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోచుకుని దాచుకునే అలవాటు బీఆర్‌ఎస్‌దే

03-01-2025 02:31:40 AM

* ఫార్ములా ఈ రేస్‌లో కేటీఆర్ తప్పుచేసినట్టు తేలింది 

* భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాం తి): దోచుకుని.. దాచుకునే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదని, ఆ సంస్రృతి బీఆర్‌ఎస్ పార్టీకే ఉందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రీజినల్ రింగ్ రోడ్డు రూ.7 వేల కోట్ల ప్రాజె క్టు అయితే, రూ.12 వేల కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ ఆరోపించడం చూస్తుంటే.. వారి పరిస్థితి ఏంటో ఆర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. పాన్ ఇండియా స్టార్ అరెస్ట్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారని పేర్కొన్నారు. కొంత మంది ముఖ్యమంత్రులు అవినీతికి పాల్పడి గుర్తింపు పొందారని, కానీ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం సాహసోపేత నిర్ణయాలు తీసుకొని గుర్తింపు పొందారని వివరించారు.

ఇక రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చి రైతులను మోసం చేయాలని బీఆర్‌ఎస్ ప్రణాళికలు వేసిందని ఆరోపించారు. కేటీఆర్ పిచ్చి మాటలు చూస్తుంటే అయనను భయం వెంటాడుతున్నట్టు తెలుస్తున్నదని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ పార్టీలాగా కాంగ్రెస్ తప్పుడు కేసులు బనాయించదని స్పష్టంచేశారు.

కేటీఆర్, హరీశ్‌రావు, కవితలు కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ ఒక్కోరోజు ఒక్కోలా మాట్లాడుతున్నారని, కేటీఆర్ తప్పు చేస్తే కచ్చితంగా జైలుకు వెళ్తారని స్పష్టంచేశారు. ఈ కేసులో కేటీఆర్ నిర్దోషి కావాలని కోరుకుంటున్నానని, కానీ ఆయన తప్పులు చేసినట్టు తేలిందని పేర్కొన్నారు.