calender_icon.png 7 November, 2024 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రాతో బీఆర్‌ఎస్ గ్రాఫ్ పడిపోయింది

07-11-2024 01:02:15 AM

  1. పార్టీ నేతలతోనే కేటీఆర్ సమావేశాలు 
  2. ఈ ఏడాది 3 శాతం రెవెన్యూ పెరిగింది 
  3. టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి 

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ సమస్య అయినా నిరుద్యోగుల సమస్య అయినా కేవలం బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నాయని పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోలేదని, బీఆర్‌ఎస్ పార్టీ గ్రాఫ్, బీఆర్‌ఎస్ నాయకుల కబ్జాలు  మాత్రం పడిపోయాయని అన్నారు.

బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ తన పార్టీ నేతలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి, వాళ్లు   రియల్ ఎస్టేట్ వ్యాపారులని చెబుతున్నారని విమర్శించారు. హైడ్రా వచ్చిన తర్వాతనే రియల్ ఎస్టేట్ పడిపోయిందని కేటీఆర్ చెప్పడంలో వాస్తవం లేదన్నారు.

హైడ్రా పనితీరు చెరువుల కబ్జాలను ఆపడమేనని, చెరువుల కబ్జాలు ఆగితే రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోందని ప్రశ్నించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల  రికార్డులను పరిశీలిస్తే తెలుస్తోందన్నారు. జులైలో 23,507, ఆగస్టులో 41,704, సెప్టెంబర్‌లో 83,090 దరఖాస్తులు రిజిష్ర్టేషన్ కోసం వచ్చాయన్నారు.

జూలై నెల నుంచి సెప్టెంబర్ వరకు 270 శాతం పెరిగిందన్నారు. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కంటే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 3 శాతం రెవెన్యూ పెరిగిందన్నారు. ప్రజలకు వివాదరహిత స్థిరాస్తి లభించే అవకాశం పెరుగుతుందని తెలిపారు. బీఆర్‌ఎస్ నాయకుల కబ్జాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగం ఆగిపోయింది కాబట్టే..

మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆగిపోయినాయన్నారు. ప్రజలు ఇప్పుడు ధైర్యంగా ఇండ్లు కొనుకుంటున్నారని  చెప్పా రు. నిజాలు దాచి అమ్మినప్పుడు వివాదాలు తలెత్తాయన్నారు.  గత ప్రభుత్వంలో అక్రమంగా చెరువులలో ఇళ్లు కట్టుకునేందుకు అనుమ తులు ఇస్తే.. అక్రమ లేఅవుట్లతో పేదలు మోసపోయారని ఆయన చెప్పారు.