calender_icon.png 28 February, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గత ప్రభుత్వమే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి కారణం

27-02-2025 09:46:05 PM

జరిగిన సంఘటనను ముందు చూపి ప్రాజెక్టును నిలిపివేసే కుట్రలు చేస్తే సహించేది లేదు

రైతు సంఘం రాష్ట్ర కమిటీ  సభ్యుడు బండ శ్రీశైలం

మునుగోడు,(విజయక్రాంతి): గత ప్రభుత్వం తప్పిదాల వలన ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదానికి గురైందని జరిగిన ప్రమాదానికి ప్రస్తుత ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండ శ్రీశైలం(Farmers Union State Committee Member Banda Srisailam) అన్నారు. గురువారం మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవన్లో ఏర్పాటు చేసిన మండల రైతు సంఘ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రమాదం జరిగి ఐదు రోజులు గడుస్తున్న టన్నల్లో కార్మికులు , ఇంజనీరింగ్ అధికారుల ఆచూకీ లభ్యం కాకపోవడం చాలా దురదృష్టకరమని అన్నారు . గత ప్రభుత్వాల కారణంగానే ప్రమాదానికి కారణమని మండిపడ్డారు. జరిగిన సంఘటనను ముందు చూపి ప్రాజెక్టును నిలిపివేసే కుట్రలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం  ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు . రెండు లక్షల ఏకకాల రుణమాఫీని అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీని చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి పెండింగ్ లో ఉన్న రైతు భరోసాను రైతులందరికీ ఏకకాలంలో చెల్లించాలి , విడతలవారీగా చెల్లించడంతోని రైతులు ఆందోళన గురవుతున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సాగర్ల మల్లేష్ , మండల కార్యదర్శి వేముల లింగస్వామి , మిర్యాల భరత్ , వరికుప్పల ముత్యాలు , మండల సీనియర్ నాయకులు యాట యాదయ్య , దొండ వెంకన్న , సిఐటి మండల సీనియర్ నాయకులు యాసరాని శ్రీను , కట్ట లింగస్వామి , పర్సగొని లింగస్వామి ఉన్నారు.