calender_icon.png 19 April, 2025 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సభకు నిరాకరణతో కోర్టుకెళ్లిన బీఆర్‌ఎస్

12-04-2025 12:10:29 AM

  1. అనుమతి మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు
  2. 17లోగా నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు

హైదారాబాద్, ఏప్రిల్ 11: బీఆర్‌ఎస్ వరంగల్ రజతోత్సవ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడం తో ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించిం ది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 17లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. సభకు అనుమతిచ్చేలా పోలీసులను ఆదేశించాలంటూ బీఆర్‌ఎస్ నేతలు పిటిషన్ వేశారు.

ఈ నెల 27న ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఈ సభను ఏర్పాటు చేసినట్టు ఆ పార్టీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, వరంగ ల్ సీపీ, కాజీపేట ఏసీపీని బీఆర్‌ఎస్ ప్రతివాదులుగా చేర్చింది. దీంతో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

కౌంటర్ దాఖలు చేయడానికి హోంశాఖ తరఫు న్యాయవాది సమ యం కోరారు. ఈ నెల 21 వరకు గడు వు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సభకు ఏర్పాట్లు చేసుకోవాల్సిన ఉంటుంది కదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నెల 17 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.