calender_icon.png 28 April, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

27-04-2025 06:54:43 PM

మంచిర్యాల (విజయక్రాంతి): బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. నస్పూర్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండాను మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు(Former MLA Nadipelli Diwakar Rao) ఎగురవేశారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ... తెలంగాణ సాధన లక్ష్యంగా 25 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆధ్వర్యంలో అలుపెరుగని పోరాటాలు చేసి స్వరాష్ట్రం సాధించుకున్నామన్నారు.

పదేళ్ల పాటు తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, వచ్చే ఎన్నికల్లో ఈ తెలంగాణ గడ్డమీద గులాబీ జెండానే ఎగురుతుందని, మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రజలంతా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని అన్నారు. అనంతరం వరంగల్ లోని వనపర్తిలో నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు వెళ్తున్న వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.