calender_icon.png 19 April, 2025 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభ విజయవంతం చేయాలి

19-04-2025 05:20:45 PM

పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ కుమార్..

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ కుమార్ మాట్లాడుతూ... ఈనెల 27న బీఆర్ఎస్ పార్టీ, ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వరంగల్ జిల్లాలోని ఎలుకతుర్తిలో నిర్వహిస్తున్న, రజితోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదేశాల మేరకు  ఎల్లారెడ్డి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ వద్ద విజయోత్సవ సభ పోస్టర్ ను విడుదల చేశారు.

అనంతరం ఎల్లారెడ్డి బిఆర్ఎస్ పార్టీ, పట్టణ అధ్యక్షుడు, ఆదిమూలం సతీష్ కుమార్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో నిర్వహించబోయే రజితో త్సవ సభకు ఎల్లారెడ్డి మండలం నుండి భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు హాజరై ప్రార్ధితోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు రేగుల నర్సింలు, మండల పార్టీ అధ్యక్షుడు జలంధర్ రెడ్డి,పార్టీ నాయకులు శ్రవణ్, అరవింద్ గౌడ్ విరాజ్, మల్లారెడ్డి, నాగం రాజయ్య, బొగ్గు సాయిలు, వసంతం గోపాల్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.