calender_icon.png 15 November, 2024 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేను లోకల్లో లేను.. ఫార్మా సిటీ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు

13-11-2024 02:34:37 PM

హైదరాబాద్: అధికారులపై దాడి సంఘటనలో బీఆర్ఎస్ శక్తులు పనిచేశాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు, తిరుపతి రెడ్డి ఆరోపించారు.  తాను రెండు రోజులుగా లోకల్లో లేనని వెల్లడించారు. ఫార్మా సిటీ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్న తిరుపతి రెడ్డి దాడి వెనక ఎవరన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. సీఎం పేరు ప్రతిష్టలు దెబ్బతీసేందుకే బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ లు ఇలాంటివి చేపిస్తున్నారని తిరుపతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధవారం సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను కలిశారు. 

ఫార్మా యూనిట్‌ ఏర్పాటుకు భూసేకరణపై బహిరంగ విచారణలో గ్రామస్థులు రెచ్చిపోయి వికారాబాద్‌ కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, కొడంగల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (కాడా) ప్రత్యేక అధికారి, తహశీల్దార్‌, ఇతర రెవెన్యూ అధికారులపై దాడి చేశారు. సోమవారం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచెర్ల గ్రామంలో అధికారులపై రైతులు రాళ్లు రువ్వడంతో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి.