calender_icon.png 20 April, 2025 | 10:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీతో బీఆర్‌ఎస్ లోపాయికారి ఒప్పందం

20-04-2025 12:39:49 AM

  1. లిక్కర్‌కేసు నుంచి కవితను కాపాడేందుకు ఊడిగం  
  2. బీజేపీకి కేటీఆర్ కట్టుబానిసగా వ్యవహరిస్తున్నారు
  3. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆగ్రహం

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాం తి): ‘దొంగల ముఠాలా రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకున్న మీరు.. అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేసి.. మీ అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోకుండా ప్రధాని మోదీకి దాసోహమయ్యారు.

మీ బలహీనతలను ఆసరాగా తీసుకున్న బీజేపీ, రాష్ట్రానికి న్యాయం గా రావాల్సిన వాటాలను, నిధులను ఇవ్వకుండా అన్యాయం చేసింది’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేసి.. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడంతో రాష్ర్టం అన్ని రంగాల్లో వెనుకబడిందని శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రవేశ పెట్టిన బిల్లులకు మద్దతు ఇచ్చింది మీరు కాదా కేటీఆర్? అంటూ మహేశ్‌కుమార్‌గౌడ్ నిలదీశారు. పదేళ్లలో మోదీ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలన్నింటికీ మద్దతినిచ్చి.. ఇప్పుడు కాంగ్రెస్‌ను ప్రశ్నించడం హాస్యాస్ప దంగా ఉందని ఎద్దేవా చేశారు. కవితను లిక్కర్ స్కామ్ నుంచి కాపాడేందుకు బీజేపీకి ఊడిగం చేసింది నిజం కాదా ఆయన నిలదీశారు.

బీజేపీకి కేటీఆర్ కట్టు బానిసలా పని చేస్తున్నారని ఆయన విమర్శించారు. బీజేపీపై బీఆర్‌ఎస్‌కు ఉన్న ప్రేమతోనే ఆ రెండు పార్టీల నేతలు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ర్పచారానికి ఒడిగడుతున్నాయని మహేశ్‌గౌడ్ మండిపడ్డా రు. సంఖ్యాబలం లేని బీజేపీ మీ పార్టీ అండ చూసుకొని హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలో పోటీ ౧౫ చేస్తోందన్నారు.

౧౫ నెలల స్వల్పకాలంలో రాష్ట్రప్రభుత్వం రికార్డు స్థాయిలో ఉద్యోగాలివ్వడం, రైతు, మహిళా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం, బీసీలకు 42 రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, పేదలకు సన్న బియ్యం అందించడం వంటి గొప్ప పనులను చేపట్టినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం మీ అజ్ఞానానికి నిదర్శనమన్నారు.