ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలపై రూ.18,500 కోట్ల విద్యుత్ భారాన్ని ఆపడంలో విజయం సాధించినందుకు బుధవారం జగదాంబ సెంటర్ లో సంబరాలు జరుపుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన తీవ్రమైన వ్యతిరేకతను, ప్రజాభిప్రాయ సేకరణను, ప్రధాన ప్రతిపక్షంగా వినిపించిన వాదనలను పరిగణలోకి తీసుకొని ప్రజలపైన భారీ విద్యుత్ భారాన్ని మోపకుండ ప్రభుత్వాన్ని నియంత్రించిన భారత రాష్ట్ర సమితి పార్టీ పని తీరు గొప్పదని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, బీఆర్ఎస్ జిల్లా వ్యవస్థాపకులు దిండిగాల రాజేందర్ అన్నారు.
పట్టణంలోని జగదాంబ సెంటర్ తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద ఇల్లందు పట్టణ, మండల కమిటీల ఆధ్వర్యంలో ప్రజల తరఫు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సిలివేరి సత్యనారాయణ, లకావత్ దేవిలాల్ నాయక్, 11వార్డు కౌన్సిలర్ జే కె. శ్రీను, ఇల్లందు పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, ఇల్లందు మండల అధ్యక్షుడు శీలం రమేష్, ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక, మాజీ వైస్ ఎంపీపీ దాస ప్రమోద్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ అజ్మీర బావు సింగ్ నాయక్, ఇల్లందు పట్టణ కమిటీ ఎండి జబ్బార్, గిన్నారపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.