calender_icon.png 11 February, 2025 | 1:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పోరాటం చేస్తుంది

11-02-2025 12:32:09 AM

  • పచ్చని పంట పొలాల్ని అదానికి, అల్లుడికి దానం చేస్తే ఊరుకోం
  • కోస్గి రైతు నిరసన దీక్షలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

నారాయణపేట, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి): రాష్ర్టంలోని రైతుల పక్షాన బీఆర్ ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందనీ, కేసీఆర్ ప్రభుత్వంలో రైతులను కళ్లల్లో పెట్టు కుని చూసుకున్నామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలల్లో రైతుబంధుకు రాంరాం చెప్పిందని, పూర్తిస్థాయిలో రుణమాఫీ జరుగలేదని, కానీ మిత్రుడు అదాని, అల్లుడు, ఎనుముల కుటుంబం కోసం రైతుల భూములను లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారని మండిప డ్డారు.

సోమవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజక వర్గం కోస్గిలో చేపట్టిన రైతు నిరసన దీక్ష కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరె మాట్లాడారు. రాష్ర్టంలో దుర్యోధన పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచిన రేవంత్‌రెడ్డి.. కొడంగల్ ప్రాంతంలో తొండలు గుడ్లు పెడ తాయి తప్ప వ్యవసాయానికి పనికి రావని చెప్పి భూములను లాక్కొనే ప్రయత్నం చేశారని, ఇక్కడికి వచ్చి చూస్తే తున్కిమెట్ల నుంచి రోడ్డుకు ఇరువైపులా పచ్చని వరి పొలాలు ఉన్నాయని చెప్పారు.

గిరిజన రైతుల భూములను లాక్కొనే ప్రయత్నం చేశారని అన్నారు. భూముల కోసం లగిచర్ల, రోటీబండతండా రైతుల పోరాట పటిమ ఆదర్శమన్నారు. డ్బ్బు మంది తండా వాసు ల మీద కేసులు నమోదు చేశారని, తరువా త బీజేపీ, కాంగ్రెస్ మద్దతుదారుల పేర్లు తొలగించి నలభై మంది బీఆర్‌ఎస్ మద్దతు దార్లను జైల్లో పెట్టారని విమర్శించారు.

మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని ౪౦ రోజులు జైల్లో పెట్టారని గుర్తుచేశారు. మాజీ ఎమ్మెల్యే ను జైల్లో కలవడానికి వెళ్తే, తాను బాగానే ఉన్నానని, రైతుల కోసం ఎన్ని రోజులైనా జైలుకు వెళ్లడానికి సిద్ధమని చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. రైతుల పక్షాన నిలబడి జైలుకు వెళ్లితే రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లారని గుర్తుచేశారు.

దమ్ముంటే రాజీనామా చేసి గెలువు

కొడంగల్ ప్రజల ఓట్లతో గెలిచిన రేవంత్ రెడ్డి దమ్ముంటే రాజీనామా చేసి గెలువమని సవాలు విశిరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి సబితా ఇంద్రా రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాలోతు కవిత, మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్ రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాంమోహన్‌రెడ్డి పాల్గొన్నారు