calender_icon.png 17 April, 2025 | 12:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసమర్థ పాలనపై బీఆర్‌ఎస్ పోరాటం

03-04-2025 12:00:00 AM

భీమదేవరపల్లి, ఏప్రిల్ 2 (విజయ క్రాంతి): అన్ని రంగాలలో విఫలమైన అసమర్థ కాంగ్రెస్ పాలనపై బి ఆర్ ఎస్ పార్టీ tv పోరాడుతుందని ఆ పార్టీ జిల్లా అధ్య క్షులు దాస్యం భాస్కర్ అన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామంలో ఈనెల 27న 10 లక్షల మందితో బిఆర్ ఎస్ పార్టీ రజితోత్సవ మహాసభ జరగనుందని దాస్యం వినయ భాస్కర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా చింతలపల్లి గ్రామ శివారు వ్యవసాయ భూములు సభ వేదిక నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. తెలం గాణ తెలంగాణ రాష్ట్ర ద్యేయంగా టిఆర్‌ఎస్ ఏర్పడిందన్నారు. తెలంగాణను దేశంలోనే కెసిఆర్ నెంబర్ వన్ గా నిలిపినారని అన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన పార్టీ రజిత వేడుకలకు వరంగల్ వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు.

మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ 160 ఎకరాల్లో సభ  పార్కింగ్ వసతులు సభకు పది లక్షల మంది ప్రజలు తరలివస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు కావాల్సిన వాటర్ బాటిళ్లు ,మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 27న మహాసభ పనులను సమర్ధవంతంగా పూర్తి చేస్తాం అన్నారు. 

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నరేందర్ చల్లా ధర్మారెడ్డి శంకర్ నాయక్ ,మాజీ చైర్మన్లు యాదవ రెడ్డి, వాసుదేవరెడ్డి ,సతీష్ రెడ్డి ,భరత్ కుమార్ రెడ్డి, సదానందం, యువ నాయకులు ఒడితల ఇంద్రనీల్, కార్పోరేటర్లు బొంగు అశోక్, యాదవ్, సోదా కిరణ్ నాయకులు నరెడ్ల శ్రీధర్ ,కొండపాక రఘు, రాకేష్ రెడ్డి ,రజనీకాంత్, రమేష్, రామ్మూర్తి చింతల యాదగిరి తో పాటు పలు మండలాల నాయకుడు పాల్గొన్నారు.