ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
హైదరాబాద్, జనవరి 28 (విజయ క్రాంతి): నల్లగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యం లో చేపట్టిన రైతు మహాధర్నాను రైతులు పట్టించుకోనే లేదని, అదొక ఫ్లాప్ షో అని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను సొంత క్యాడరే పట్టించుకోలేదని చురకలంటించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నాలకు బోనస్, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో రైతులు సంతోషంగా ఉన్నారని, బీఆర్ఎస్ నేతలు అది ఓర్చుకోలేకే తమ ప్రభుత్వానిపై అవాకులు చెవాకులు పేలుతున్నారని తెలిపారు.
రైతుభరోసా పథకంలో భాగంగా తొలిరోజే రైతుల ఖాతాల్లో రూ.569 కోట్లు, ఇం దిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా 18,180 మంది కూలీల ఖాతాల్లో రూ.10.91 కోట్లు జమ చేశామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంత ఒకేరోజు నాలుగు పథకాలను ప్రారంభించగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ మైండ్ బ్లాక్ అయిందని, అందుకే చిల్లర మల్లర ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.