calender_icon.png 12 January, 2025 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ రైతు ధర్నా వాయిదా

12-01-2025 12:00:00 AM

నల్లగొండ, జనవరి 11 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా కేంద్రంలో నేడు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిర్వహించ తలపెట్టిన రైతు మహాధర్నా మరోసారి వాయిదా పడింది. సంక్రాంతి నేపథ్యంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నెలకొన్న నేపథ్యంలో ప్రయాణికులు, ప్రజల రాకపోకల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ శనివారం ప్రకటనలో వెల్లడించారు. సంక్రాంతి తరువాత ధర్నా నిర్వహణ తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు.