ఫిరాయింపులపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు
పార్టీలోకి వస్తామంటే వద్దంటామా..?
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేనే లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పార్టీలోకి చేరుతామంటే ఎవరైనా వద్దంటారా..? అని ప్రశ్నించారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రీతమ్, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్‌గా ఆలేఖ్య బాధ్యతలు చేపట్టగా.. మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు హాజరై వారిని అభినందించారు. మంత్రి మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు వస్తాయని తెలిపారు. గతంలో బీఆర్‌ఎస్ నాయకులు తమ పార్టీ నాయకులను బెదిరించి చేర్చుకున్నారని, కానీ తాము ఎవరిని బెదిరించడం లేదని, వారతంట వారే పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. కారు పార్టీలో మిగిలేది ఆ నలుగురేనని ఎద్దేవా చేశారు.