19-04-2025 01:12:22 PM
హైదరాబాద్: తెలంగాణ భవన్ లో గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) నేతల సమావేశం జరిగింది. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ కు బీఆర్ఎస్ దూరం కానుంది. బలం లేదు కాబట్టే అభ్యర్థిని పోటీలో పెట్టలేదని కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఉన్న మన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఎవరూ ఓటుకు వెళ్లొద్దని కేటీఆర్ ఆదేశించారు. ఆ రోజు ఎన్నికల్లో పాల్గొనవద్దని విప్ కూడా ఇస్తామన్నారు.
పార్టీ రజతోత్సవ కార్యక్రమాలు, వరంగల్ బహిరంగ సభపై నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ట్రైనింగ్ ఇప్పిస్తామన్న ఆయన కార్యకర్తలకు విషయాలపై అవగాహన ఉంటేనే మాట్లాడగలరని పేర్కొన్నారు. సభ తర్వాత కొత్తగా సభ్యత్వాలు తీసుకుంటామని తెలిపారు. ఇక పై డిజిటల్ సభ్యత్వాలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. అక్టోబర్ లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ఆయన వెల్లడించారు. డీలిమిటేషన్ జరిగితే హైదరాబాద్ లోనే సీట్లు పెరుగుతాయని సూచించారు. సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు హాజరయ్యారు.