calender_icon.png 10 January, 2025 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

రైతు భరోసా కోసం బీఆర్‌ఎస్ ధర్నా

07-01-2025 12:00:00 AM

కరీంనగర్, జనవరి 6 (విజయక్రాంతి): రైతు భరోసా 12 వేలు కాదు, ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం 15 వేలు రైతు భరోసా చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలు పు మేరకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమ లాకర్ ఆదేశానుసారం బీఆర్‌ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్లో నిరసన కార్య క్రమం నిర్వహించారు.

మాట తప్పిన రాహు ల్, రేవంత్ తో సహా అందరూ తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు తెలి పారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీ ల్రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణవు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.