హైదరాబాద్: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం శనివారం ప్రారంభం అయింది. కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగుతోంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియంను చుట్టుముట్టారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. ఫిరాయింపులను బీఆర్ఎస్ పార్టీనే ప్రోత్సహించిందని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసనతో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. మేయర్ విజయలక్ష్మి కౌన్సిల్ సమావేశాన్ని 15 నిమిషాలు వాయిదా వేశారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసనకు చేస్తున్నారు.