12-03-2025 04:46:10 PM
బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు
చర్ల,(విజయక్రాంతి): ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎత్తిచూపి ప్రజలకు వివరించడమే ప్రతిపక్షాల ప్రధాన బాధ్యత అని బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు(BRS Convener Doddi Tatarao) బుధవారం చర్ల మండల కేంద్రంలో గల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కెసిఆర్(KCR) పరిపాలనలో రైతులు మూడు పువ్వులు ఆరు కాయలు అన్న విధంగా ఆనందంగా ఉన్నారని, నేడు పంటలు పండక గిట్టుబాటు ధర లేక, తాగునీళ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకునే నాథుడే లేడని విమర్శించారు. ఆరు గ్యారంటీలు 420 హమీలతో అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేక పోతున్నారు కొన్ని వేలమంది రైతులకు రుణ మాఫీ చేయాలి, రైతు బరోసా పూర్తిగా అందలేదు, ఆడపడుచులకు తులం బంగారం లేదు, రూ 2500 లేదు, ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన వారందరికీ ఇస్తామని చెప్పి మండలాని ఒక గ్రామానికి అని ప్రజలందరిని మోసం చేసారని ధ్వజమెత్తారు.
కెసిఆర్ బడుగు బలహీన వర్గాల కోసం రాష్ట్రంలో 26 మెడికల్ కళాశాలలు కట్టీంచారని,వందల గురుకుల పాఠశాలలు కట్టించారని,ప్రతీ జిల్లాకు కలెక్టర్ ఆఫీసులు కట్టించారని, ఇప్పుడు మీరు ఇస్తున్న కళ్యాణ్ లక్ష్మి చెక్కులు కెసిఆర్ ఇచ్చినవే అన్నారు. కెసిఆర్ జోలికి వస్తే తెలంగాణ ప్రజలు బిఆర్ యస్ పార్టీ కార్యకర్తలు చూస్తు ఊరు కోరు ప్రజల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగే దాక పోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో కో కన్వీనర్ ఐనవోలు పవన్ సీనియర్ నాయకులు SD అజీజ్ అనిల్ పంజా రాజు గోరంట్ల వెంకటేశ్వరావు తదితర బిఆర్ యస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు