calender_icon.png 15 November, 2024 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిని అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ కుట్ర

14-11-2024 01:10:43 AM

వికారాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): కొడంగల్ నియోజకవర్గ అభి వృద్ధిని అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ కుట్ర లు చేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ నేత తిరుపతిరెడ్డి ఆరో పించారు. బుధవారం ఆయన వికారాబాద్ కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రతీక్‌జైన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంత రం కొడంగల్‌లో కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు.

లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా ప్రత్యేకాధికారి వెంకటరెడ్డితో పాటు అధికా రులపై దాడులు బాధాకరమన్నారు. రైతులను కొందరు రెచ్చగొట్టి, వారిలో లేనిపోని అపోహలు కలిగించారన్నారని మండిపడ్డారు. ఏవైనా ఇబ్బందులు ఉం టే నేరుగా రైతులు అధికారులకు గానీ, ముఖ్యమంత్రికి గానీ చెప్పుకోవచ్చన్నా రు.

కానీ, దాడులకు పాల్పడడం సరైన పద్ధతి కాదన్నారు. రాష్ట్రప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ కొడంగల్‌కు పారిశ్రా మిక కంపెనీలను తీసుకువస్తుందన్నారు. తద్వారా నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు.